ఆది సాయి కుమార్, మిషా నారంగ్ జంటగా నటిస్తున్న చిత్రం "CSI సనాతన్". శివశంకర్ దేవ్ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తుండగా, చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ పై అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలయింది. హీరో హీరోయిన్ల మధ్య లవ్లీ డ్యూయెట్ సాంగ్ గా తెరకెక్కించిన సెనోరిటా అనే ఈ లిరికల్ సాంగ్ ను యాజిన్ నిజార్ ఆలపించారు. అనీష్ సోలొమన్ స్వరపరిచారు.
నందిని రాయ్, అలీ రెజా, ఖయ్యుమ్, తారక్ పొన్నప్ప తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు Dop: గంగనమోని శేఖర్ అందిస్తుండగా, అమర్ రెడ్డి ఎడిటర్ గా పని చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa