బాలీవుడ్ సీనియర్ దర్శకుడు ఇస్మాయిల్ ష్రాఫ్(62) కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆస్పత్రిలో బుధవారం అర్థరాత్రి కన్నుమూశారు. 'అగర్' సినిమాతో దర్శకుడిగా మారిన ఇస్మాయిల్ ష్రాఫ్ దాదాపు 20 సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో తోడీసీ బేవఫాయ్, బులంది, అహిస్ట అహిస్ట లాంటి హిట్ సినిమాలున్నాయి. ఆయన చివరిగా 2004లో 'తోడా తుమ్ బద్‌లో తోడా హమ్' అనే సినిమా తీశారు.