కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన కొత్త చిత్రం "సర్దార్". దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన తెలుగు, తమిళ భాషలలో సర్దార్ టైటిల్ తో విడుదలైన ఈ సినిమా దివాళి బ్లాక్బస్టర్ హిట్ గా నిలిచింది. ఇరు రాష్ట్రాల ప్రేక్షకులు ఈ సినిమాను విశేషంగా ఆదరిస్తున్నారు.
బలమైన కంటెంట్ తో, అమేజింగ్ టేకింగ్ తో PS మిత్రన్ ఈ సినిమాను ఎంతో ఇంటెలిజెంట్ గా తెరకెక్కించారు. సర్దార్ గా, సిన్సియర్ కాప్ గా కార్తీ ద్విపాత్రాభినయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అంత బాగా నటించి, ప్రేక్షకులు, విమర్శకుల మెప్పును పొందుతున్నారు.
తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ, స్పెషల్ వీడియోను విడుదల చేసారు. అలానే సర్దార్ చిత్రబృందమే సీక్వెల్ లోనూ నటించబోతుందని, అతి త్వరలోనే సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలుస్తుంది. దీంతో కార్తీ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa