టాలీవుడ్ కింగ్ నాగార్జున నుండి రీసెంట్గా వచ్చిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ "ది ఘోస్ట్". ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు డైరెక్టర్ కాగా, సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించింది.
దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలైతే వచ్చినవి కానీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పేలవ ప్రదర్శనను కనబరిచింది. దీంతో ఈ మూవీ వెంటనే డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది.
నవంబర్ 2 నుండి నెట్ ఫ్లిక్స్ లో ది ఘోస్ట్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. మరి ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కు ఓటిటిలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa