నాచురల్ స్టార్ నాని, కీర్తిసురేష్ జంటగా నటిస్తున్న చిత్రం "దసరా". శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకుడు కాగా, సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ బాచుపల్లి ఏరియా లో ప్రత్యేకంగా నిర్మించిన ఖరీదైన సెట్స్ లో జరుగుతుందట. ఈ షెడ్యూల్ లో కీలక పాత్రధారులపై మేజర్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారట.
సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి నెలలో విడుదల కావడానికి రెడీ అవుతుంది. నాని కెరీర్ లో భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న చిత్రమిది. అంతేకాక నాని నటిస్తున్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa