గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ నటిస్తున్న సినిమా టైటిల్ ను కర్నూలులో ప్రత్యేకంగా ప్రకటించారు. ఈ సినిమాకి 'వీర సింహారెడ్డి' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా 2023 సంక్రాంతికి భారీగా విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆడియో రైట్స్ ని ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సోనీ మ్యూజిక్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం.
గతంలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్, టీజర్‌కి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. నవంబర్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు.
ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa