ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంట్రవర్సీలో చిక్కుకున్న "కాంతార" మూవీ

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 25, 2022, 03:18 PM

కాంతార... ఈ కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ పేరు ప్రతి పరిశ్రమలోనూ వినిపిస్తుంది. అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు చాలామంచి స్పందన వస్తుంది. బుక్ మై షో ఆన్లైన్ టికెట్ పోర్టల్ లో 9.9 రేటింగ్ (100కే రివ్యూస్) తో నెవర్ బిఫోర్ రికార్డును తన ఖాతాలో వేసుకున్న ఈ మూవీ తాజాగా కర్ణాటకలో హోంబలే ఫిలిం సంస్థ నిర్మించిన సినిమాలలో ఎక్కువ వ్యూయర్ షిప్ పొందిన సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది.


ఐతే, ఈ సెన్సేషనల్ మూవీ తాజాగా ఒక కాంట్రవర్సీలో చిక్కుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో వరాహరూపం అనే ట్రెడిషనల్ సాంగ్ కి ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వచ్చింది. ఈ పాటను స్వరపరిచిన అజనీష్ లోక్ నాధ్ కు చాలా మంచి పేరు వచ్చింది. ఐతే, ఈ పాటను అజనీష్ కాపీ కొట్టారని తెలుస్తుంది.


కేరళకు చెందిన మల్టీ జానర్ మ్యూజిక్ బ్యాండ్ "తైక్కుదాం బ్రిడ్జ్" కంపోజ్ చేసిన నవరసం అనే అఫీషియల్ మ్యూజిక్ వీడియో కు వరాహరూపం సాంగ్ కాపీ అని, ఆ బ్యాండ్ అధినేతలు లీగల్ యాక్షన్ కు దిగారు. మరి, ఈ విషయంలో లేటెస్ట్ అప్డేట్ తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa