దీపావళి కానుకగా నిన్న విడుదలైన "వాల్తేరు వీరయ్య" టైటిల్ ఎనౌన్స్మెంట్ టీజర్ యూట్యూబులో దూసుకుపోతుంది. ప్రేక్షకాభిమానుల నుండి విశేష స్పందన లభించడంతో ఇప్పటివరకు ఈ టీజర్ కు తొమ్మిది మిలియన్ కు పైగా వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబులో నెంబర్ 1 పొజిషన్ లో ట్రెండింగ్లో కొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి గారిని ఊరమాస్ అవతారంలో చూసి చాలా రోజులైన నేపథ్యంలో ఈ టీజర్ ప్రత్యేక ఆకర్షణను సంతరించుకుంది.
పోతే, ఈ సినిమాకు బాబీ కొల్లి డైరెక్టర్ కాగా, మాస్ రాజా రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారు. శృతిహాసన్, క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa