"యశోద" సినిమాతో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత నవంబర్ 11వ తేదీన ప్రేక్షకాభిమానులను థియేటర్లలో పలకరించనుంది. ఈ విషయం తెలిసిందే కదా.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసారు. ఈ మేరకు అక్టోబర్ 27వ తేదీ సాయంత్రం 05:36 నిమిషాలకు యశోద ట్రైలర్ విడుదల కాబోతున్నట్టు దీపావళి సందర్భంగా యశోద మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
హరి శంకర్, హరీష్ నారాయణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa