గతేడాది టాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన సినిమాల్లో 'డీజే టిల్లు' ఒకటి. విమల్ కృష్ణ డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ నటించిన "డీజే టిల్లు" సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ క్రైమ్ కామెడీ సినిమాలో సిద్ధు జొన్నలగడ్ సరసన బ్యూటీ క్వీన్ నేహా శెట్టి జంటగా నటించింది. రొమాంటిక్ యాక్షన్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌ను మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.
తాజాగా ఇప్పుడు దీపావళి సందర్భంగా, మూవీ మేకర్స్ ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ప్రోమోను విడుదల చేసారు. ఈ సినిమాకి 'టిల్లు స్క్వేర్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రాన్ని మార్చి 2023లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సిద్ధూ సరసన ఈ సినిమాలో బ్యూటీ క్వీన్ అనుపమ పరమేశ్వరన్ జోడిగా కనిపించనుంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల, రామ్ మిరియాల సంగీతం అందించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa