ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మెగా 154' కి పవర్ ఫుల్ టైటిల్ లాక్

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 24, 2022, 05:20 PM

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీతో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ లో చిరు సరసన టాలెంటెడ్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో రవితేజ వైజాగ్ రంగారావు గా ఔట్ అండ్ అవుట్ మాస్ పోలీస్ గా కనిపించనున్నాడు అని లేటెస్ట్ టాక్.


తాజాగా ఈరోజు మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి వీడియో గ్లింప్సె ని విడుదల చేసారు. ఈ టీజర్ చిరంజీవిని మాస్ అవతార్‌లో చూపిస్తుంది. ఈ సినిమా టైటిల్‌ను ఈరోజు పవర్ ఫుల్ టీజర్‌తో మూవీ మేకర్స్ ప్రకటించారు. 'వాల్టెయిర్ వీరయ్య' అనే టైటిల్‌ ని లాక్ చేసినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ యాక్షన్ ప్యాక్డ్ టీజర్‌ను మరింత ఆసక్తికరంగా చేసింది.


మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బాబీ సింహా పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa