కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నుండి వచ్చిన కొత్త చిత్రం "నేనే వస్తున్నా". సెల్వరాఘవన్ డైరెక్షన్లో సైకో తరహా యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా లో ఇందూజ రవిచంద్రన్, ఎల్లీ అవ్రామ్ హీరోయిన్లుగా నటించారు.
తాజాగా ఈ సినిమా అఫీషియల్ గా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. అక్టోబర్ 27 నుండి ప్రముఖ ఓటిటి దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేనే వస్తున్నా చిత్రం స్ట్రీమింగ్ కి రాబోతుంది.
యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రం తమిళంలో 'నానే వరువేన్' టైటిల్ తో విడుదలైంది. తెలుగులో ఈ సినిమాను అల్లు అరవింద్ గారు సమర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa