"తగ్గేదేలే" సినిమా నుండి నిన్న విడుదలైన ఓల్డ్ క్లాసిక్ మెలోడీ 'మాటే మంత్రము' సాంగ్ ప్రోమోకి చాలామంచి స్పందన వస్తుంది. సీతాకోకచిలుక సినిమాలోని ఎవర్గ్రీన్ హిట్ సాంగ్ 'మాటే మంత్రము'. ఆ సినిమాలో ఆ పాటను Sp బాలసుబ్రహ్మణ్యం గారు, శైలజ గారు కలిసి ఆలపించగా, సేమ్ అదే పాటను ఇప్పుడు తగ్గేదేలే సినిమాలో వాడుతున్నారు. పోతే, ఈ పూర్తి పాట ఈ రోజు సాయంత్రం ఐదింటికి విడుదల కానుంది. విశేషమేంటంటే, ఈ పాట పాడిన లేట్ లెజెండరీ సింగర్ శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి తనయుడు SP చరణ్ ఈ పాటను విడుదల చెయ్యనున్నారు.
నవీన్ చంద్ర, దివ్య పిళ్ళై ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా, శ్రీనివాసరాజు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa