ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలోనే అడివిశేష్ హిట్ 2 టీజర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 22, 2022, 03:19 PM

ఈ ఏడాది విడుదలైన 'మేజర్' సినిమాతో కెరీర్ లో మేజర్ హిట్ అందుకున్నాడు యువ హీరో అడివిశేష్. ఆ సినిమాతో శేష్ పాన్ ఇండియా క్రేజ్ కైవసం చేసుకున్నాడు. దీంతో మేజర్ తరవాత ఆయన నుండి రాబోతున్న సినిమాపై చాలా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.


అడివిశేష్ నెక్స్ట్ మూవీ హిట్ 2 అని అందరికి తెలుసు. శైలేష్ కొలను డైరెక్షన్లో హీరో విశ్వక్ సేన్, రుహాని శర్మ జంటగా నటించిన హిట్ : ది ఫస్ట్ కేస్ సినిమాకు ఎక్స్టెన్షన్ గా రాబోతున్న హిట్ 2 లో అడివిశేష్, మీనాక్షి చౌదరి, కోమలి ప్రసాద్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన విడుదల కాబోతుంది.


తాజాగా ఈ మూవీ టీజర్ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ హీరో నాని ట్వీట్ చేసారు. నానికి ఈ సినిమాకు సంబంధమేంటనుకుంటున్నారా ... ఈ సినిమాకు నిర్మాత నానినే మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa