ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశ్వక్ సేన్ "ఓరి దేవుడా" పై ఇంటరెస్టింగ్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 21, 2022, 07:19 PM

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన కొత్త సినిమా "ఓరి దేవుడా" ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. ఫస్ట్ షో నుండే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.


కోలీవుడ్ మూవీ ఓహ్ మై కడవులే కి ఈ సినిమా అఫీషియల్ తెలుగు రీమేక్. తాజాగా ఈ సినిమాపై ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే, ముందుగా ఈ సినిమాకు "హే భగవాన్" అనే టైటిల్ ను పెడదామని అనుకున్నారట. విశ్వక్ గత చిత్రాలు పాగల్, హిట్ ... రెండూ కూడా పరభాషా టైటిల్స్ కావడంతో ఈ సినిమాకు అచ్చ తెలుగు టైటిల్ ను పెడదామనే ఉద్దేశంతో హే భగవాన్ నుండి ఓరి దేవుడా కు మూవీ టైటిల్ ను మార్చడం జరిగిందట.


అశ్వత్ మరిముత్తు డైరెక్షన్లో ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా నటించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa