విభిన్న చిత్రాల దర్శకుడు తేజ డైరెక్ట్ చేస్తున్న కొత్త చిత్రం "అహింస". దగ్గుబాటి అభిరాం, గీతికా ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. RP పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు.
చాలా కాలం తరవాత తేజ - పట్నాయక్ కాంబోలో రాబోతున్న సినిమా ఇది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు మ్యూజికల్ హిట్స్ కావడంతో ఈ సినిమా పై చాలా మంచి అంచనాలు ఉన్నాయి.
ఇప్పటివరకు విడుదలైన రెండు లిరికల్ సాంగ్స్ కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకునే స్థాయిలో ఉన్నాయి. తాజాగా మేకర్స్ మూడో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు కొంచెంసేపటి క్రితమే అమ్మేసానే అనే మాస్ ఐటెం సాంగ్ ప్రోమో విడుదలైంది. అక్టోబర్ 24న ఉదయం 09:09 నిమిషాలకు ఈ పాట యొక్క పూర్తి లిరికల్ విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa