ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది ప్రభాస్ - మారుతి సినిమా. బాహుబలి తదుపరి వరస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ, తన క్రేజ్ తో , ఫ్యాన్ బేస్ తో ఏ హీరోకి అందనంత ఎత్తుకు ఎదిగిన ప్రభాస్, కొన్నాళ్లుగా సాలిడ్ హిట్ లేని మారుతితో సినిమా చేస్తున్నాడంటే ... ఈ విషయం హాట్ టాపిక్ గా మారడంలో ఎలాంటి విశేషం లేదు.
తాజా సమాచారం ప్రకారం, ఇటీవలే ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కి సంబంధించిన టెస్ట్ షూట్ జరిగిందట. ఔట్పుట్ సాటిస్ఫ్యాక్టరీ గా ఉందంట. ఇక, రేపే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లబోతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి, ఈ విషయంలో ఇప్పటివరకైతే, ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa