బుట్టబొమ్మ పూజ హెగ్డే తాజాగా గాయపడినట్లు తెలుస్తోంది. తన కాలు లిగ్మెంట్ టియర్ కావడంతో ప్రస్తుతం ఆమె నడవలేని స్థితిలో ఉంది. కాలుకు పట్టి కట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. లిగ్మెంట్ టియర్ అయ్యిందని పూజ ఇన్ స్టా లో తెలిపింది. ఈ గాయం ఎలా అయ్యిందనేది క్లారిటీ ఇవ్వలేదు. కానీ, సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ క జాన్’ షూటింగ్‌లో యాక్షన్ సీన్స్ చేస్తుండగా గాయపడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి.