మెగాస్టార్ చిరంజీవి, మాస్ రాజా రవితేజ కలిసి బాబీ డైరెక్షన్లో ఒక పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారన్న విషయం తెలిసిందే కదా. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాపై ఇంటరెస్టింగ్ బజ్ ఒకటి మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే,, ఈ సినిమా టోటల్ రన్ టైం లో రవితేజ పోషిస్తున్న పాత్ర యొక్క స్క్రీన్ టైం దాదాపు ముప్పై శాతం ఉంటుందట. మరి ఈ విషయంపై ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ యొక్క టైటిల్ టీజర్ అక్టోబర్ 24వ తేదీన ఉదయం 11:07 నిమిషాలకు లాంచ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa