నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న "అన్ స్టాపబుల్" టాక్ షో సీజన్ 2 ఇప్పటికే పెద్ద హిట్టవ్వగా, రెండో ఎపిసోడ్‌కి టాలీవుడ్ యంగ్ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ గెస్ట్స్ గా వచ్చారు. తాజాగా ఇప్పుడు, రాబోయే ఎపిసోడ్‌కి సీనియర్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ మరియు బబ్లీ బ్యూటీ రాశీఖన్నా ఈ కార్యక్రమానికి అతిధులుగా హాజరు కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ షోతో ఆహా భారీ వసూళ్లు రాబట్టింది. రానున్న రోజుల్లో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కూడా గెస్ట్‌లుగా వస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ షోకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa