ఇరు తెలుగు రాష్ట్రాలలో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న కన్నడ మూవీ "కాంతార". రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి, లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా ముందుగా కన్నడ భాషలోనే తెరకెక్కగా, ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన కారణంగా మేకర్స్ ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో విడుదల చేసారు. అన్ని చోట్లా కాంతార సినిమాకు ఎక్సెలెంట్ రెస్పాన్స్ వస్తుంది.
తాజాగా ఈ సినిమా నుండి వరాహరూపం అనే ట్రెడిషనల్ సాంగ్ కి సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. అజనీష్ లోక్ నాధ్ స్వరపరిచిన ఈ పాటను సాయి విగ్నేష్ ఆలపించారు. శషిరాజ్ కవూర్ సాహిత్యం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa