తమిళ రొమాంటిక్ కామెడీ ట్రాక్ లో వచినా "ఓ మై కడవులే" సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తెలుగులో ఈ సినిమాకి "ఓరి దేవుడా" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ ఫిక్స్ చేసారు. తమిళ్ లో ఈ సినిమాని డైరెక్ట్ చేసిన అశ్వత్ మరిముత్తు తెలుగులో కూడా డైరెక్ట్ చేయనున్నారు.
'ఓరి దేవుడా' ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మాస్ కా దాస్, విశ్వక్ సేన్ సరసన బాలీవుడ్ బబ్లీ బ్యూటీ మిథిలా పాల్కర్ ఈ సినిమాలో నటిస్తోంది. ఈ ఫాంటసీ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించారు.
తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందినట్లు అంతేకాకుండా ఈ సినిమా దాదాపు 143 నిమిషాల రన్ టైమ్ ని కలిగి ఉంది అని సమాచారం. ఈ సినిమాలో ఆశా భట్, రాహుల్ రామకృష్ణ మరియు ఇతరులు సహాయక పాత్రలు పోషించారు. పివిపి సినిమా మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa