ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటిటీలోకొచ్చేసిన శర్వానంద్ "ఒకేఒక జీవితం"..!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 19, 2022, 07:22 PM

వరస పరాజయాలలో ఉన్న టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ను తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సినిమా "ఒకేఒక జీవితం". టైం ట్రావెల్ నేపథ్యంలో, బలమైన అమ్మ సెంటిమెంట్ తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.


అద్భుతమైన ధియేటర్ రన్ ముగించుకున్న ఈ మూవీ లేటెస్ట్ గా డిజిటల్ లో సందడి చెయ్యడం ఆరంభించింది. ఈ మేరకు సోనీ లివ్ ఓటిటిలో ఒకేఒక జీవితం తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకొచ్చేసింది. 


శ్రీ కార్తీక్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, జెక్స్ బిజోయ్ సంగీతం అందించారు. డ్రీం వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు క్రేజీ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa