విశ్వక్ సేన్ నటించిన కొత్త సినిమా "ఓరి దేవుడా". మరో రెండ్రోజుల్లో అంటే అక్టోబర్ 21వ తేదీన ఇరు తెలుగు రాష్ట్రాల థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
ఇటీవల ఈ మూవీ నుండి విడుదలైన గుండెల్లోనా అనే రొమాంటిక్ డ్యూయెట్ వీడియో సాంగ్ కు యూట్యూబులో ఇప్పటివరకు 5 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. అంతేకాక టాప్ ట్రెండింగ్ మ్యూజిక్ లో #2 పొజిషన్ లో దూసుకుపోతుంది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ ఆలపించిన ఈ పాట తెలుగు శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటుంది.
విక్టరీ వెంకటేష్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ మూవీలో మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అశ్వత్ మరిముత్తు డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ లవ్ & కామెడీ ఎంటర్టైనర్ కు లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa