కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్లో శింబు, కళ్యాణి ప్రియదర్శిని జంటగా నటించిన చిత్రం "మానాడు". గతేడాది విడుదలైన ఈ మూవీ తమిళనాట బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం, sj సూర్య క్రూరమైన విలన్గా నటించిన తీరు సినిమాకు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి.
తాజాగా ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ వారు రంగం సిద్ధం చేస్తున్నారని వినికిడి. ముందుగా హీరో రానాతో ఈ సినిమా చెయ్యాలనుకున్నారట కానీ, తాజాగా తెరపైకి రవితేజ, సిద్ధూ పేర్లు వినబడుతున్నాయి. మరి, సురేష్ ప్రొడక్షన్స్ నుండి అధికారిక ప్రకటన వస్తే కానీ, ఈ విషయంలో క్లారిటీ రాదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa