టాలీవుడ్ టాప్ సైరన్ సమంత నుండి బ్యాక్ టు బ్యాక్ రెండు పాన్ ఇండియా సినిమాలు రాబోతున్న విషయం తెలిసిందే కదా. ఆ సినిమాలేంటంటే గుణశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన "శాకుంతలం", హరి శంకర్, హరీష్ నారాయణ్ ల "యశోద".
శాకుంతలం విడుదల ఇక వచ్చే ఏడాదే అని ప్రచారం జరుగుతుండగా, తాజాగా యశోద మేకర్స్ రిలీజ్ డేట్ ను రేపు ఎనౌన్స్ చేస్తామంటూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించారు.
హరి శంకర్, హరీష్ నారాయణ్ ల దర్శకత్వంలో సైన్టిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, మురళీశర్మ, రావురమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa