మెహర్ రమేష్ డైరెక్షన్లో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం "బిల్లా". అనుష్క శెట్టి ఫిమేల్ లీడ్ పోషించిన ఈ చిత్రంలో హన్సిక మోత్వానీ, సుబ్బరాజు, నమిత కీ రోల్స్ పోషించారు. ఈ సినిమా యొక్క ప్రత్యేకత ఏంటంటే, సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజుగారితో కలిసి ప్రభాస్ స్క్రీన్ షేర్ చేసుకున్న తొలి చిత్రమిదే. అలానే కృష్ణంరాజు గారు తన సొంత ప్రొడక్షన్ సంస్థైన గోపికృష్ణ మూవీస్ బ్యానర్ పై సొంతంగా నిర్మించారు.
తాజాగా ఈ రోజు బిల్లా 4కే స్పెషల్ స్క్రీనింగ్స్ జరిగాయి. ఈ మేరకు వచ్చిన కలెక్షన్లను UK ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ కి డొనేట్ చేస్తున్నారట మేకర్స్. ఈమేరకు కృష్ణంరాజుగారి కుమార్తె ప్రసీద అధికారిక ప్రకటన చేసారు. ఈ సంస్థలో కృష్ణంరాజు కూడా ఒక పార్టనర్. ప్రస్తుతం గోపికృష్ణ సంస్థను ప్రసీదే చూసుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa