పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుండి రాబోతున్న హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ "సలార్". ప్రభాస్ పాన్ ఇండియా పాపులారిటీకి కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ క్రేజ్ తోడవ్వడంతో ఈ సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్ లోనే కాక ఆడియెన్స్ లోనూ భారీ అంచనాలున్నాయి.
గత కొన్నాళ్ల నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి రేపు ఉదయం అద్దిరిపోయే అప్డేట్ రాబోతుందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది.
మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలకపాత్రను పోషిస్తున్నారన్న విషయం తెలిసిందే కదా. రేపు పృథ్విరాజ్ సుకుమారన్ బర్త్ డే కావడంతో ఆయనకు సంబంధించిన పోస్టర్ రాబోతుందని టాక్.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు కీరోల్ లో నటిస్తున్నారు. రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa