మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ప్రస్తుతం కెరీర్ లో రెండవ పాన్ ఇండియా మూవీ షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పొలిటికల్ యాక్షన్ డ్రామా లా ఉంటుందని, శంకర్ మార్క్ టేకింగ్, చెర్రీ స్టైలిష్ స్వాగ్ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయట.
కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటుంది. సమ్మర్ 2023 కి ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుందని జరిగిన ప్రచారం కాస్త తాజాగా కొత్త మలుపు తీసుకుని వచ్చే ఏడాది దసరాకు విడుదల కావడానికి రెడీ అవుతుందని ప్రచారం జరుగుతుంది. మరైతే ఈ విషయంలో అధికారిక క్లారిటీ రావలసి ఉంది. శంకర్ ఇండియన్ 2 షూటింగ్ ను RC 15 షూటింగ్ ను సైమల్టేనియస్ గా జరపడం వల్లనే ఈ ఆలస్యం అని కొంతమంది అభిప్రాయం.
అంజలి మరొక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు SJ సూర్య కీలకపాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa