ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్ #1 ట్రెండింగ్లో నాని మాస్ లోకల్ స్ట్రీట్ సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 11, 2022, 06:26 PM

నాచురల్ స్టార్ నాని నటిస్తున్న దసరా సినిమా నుండి రీసెంట్గా విడుదలైన ధూందాం దోస్తాన్ అనే లిరికల్ సాంగ్ కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. దసరా పండుగను పురస్కరించుకుని ఈ సినిమా నుండి తొలి ప్రమోషనల్ కంటెంట్ విడుదలవ్వగా, ఈ మాస్సీ లోకల్ స్ట్రీట్ సాంగ్ కు యూట్యూబు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. పాన్ ఇండియా భాషల్లో విడుదలైన ఈ పాటకు ఇప్పటివరకు 7.5 మిలియన్ ప్లస్ వ్యూస్ రాగా యూట్యూబ్ #1 ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఇలానే సినిమా కూడా థియేటర్లను దద్దరిల్లేలా చేసి, టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ మూవీని శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తుండగా, సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.


ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 30వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa