బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన కొత్త చిత్రం "రామ్ సేతు". టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. గ్లామరస్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటిస్తుంది.
లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ పై అఫీషియల్ అప్డేట్ వచ్చింది. అక్టోబర్ 11వ తేదీన రామ్ సేతు ట్రైలర్ విడుదల కావడానికి రెడీగా ఉందని తెలుపుతూ స్పెషల్ పోస్టర్స్ విడుదల చేసారు. దీపావళి కానుకగా అక్టోబర్ 25వ తేదీన ఈ మూవీ థియేటర్లలో విడుదల కాబోతుంది.
అభిషేక్ శర్మ ఈ సినిమాకు డైరెక్టర్ కాగా, అరుణ భాటియా, విక్రమ్ మల్హోత్రా, సుభాస్కరన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa