యంగ్ హీరో శ్రీసింహ వరసపెట్టి సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. ఇటీవలే దొంగలున్నారు జాగ్రత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించిన శ్రీసింహ ఆ వెంటనే మరొక కొత్త సినిమాను ఎనౌన్స్ చేసేందుకు రంగం సిద్ధం చేసాడు. ఇదికాక "ఉస్తాద్" మూవీ ఆల్రెడీ సెట్స్ పై ఉంది.
శ్రీ సింహ కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రేపు ఉదయం 11:43 నిమిషాలకు రిలీజ్ కానున్నాయి. ప్రణీత్ సాయి డైరెక్షన్లో ఇంటరెస్టింగ్ క్రైం కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.
వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్ సినిమాస్, సిని వ్యాలీ మూవీస్ సంయుక్త బ్యానర్ లపై అర్జున్ దాస్యం, యష్ రంగినేని, సింగనమల కళ్యాణ్ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa