ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రన్ టైమ్ ని లాక్ చేసిన 'ది ఘోస్ట్'

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 03, 2022, 08:59 PM

ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున 'ది ఘోస్ట్‌' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నారు. ది ఘోస్ట్ సినిమా అక్టోబర్ 5, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో ఏజెంట్ విక్రమ్ గా నాగార్జున కనిపించనున్నారు.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా 2 గంటల 20 నిమిషాల రన్ టైమ్ ని కలిగి ఉంది అని సమాచారం. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్, శ్రీకాంత్ అయ్యంగార్ మరియు రవివర్మ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి మరియు నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ జి. గణేష్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి భరత్-సౌరభ్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa