ట్రెండింగ్
Epaper    English    தமிழ்

100 కోట్లు రాబట్టేసిన 2.ఓ హిందీ వెర్షన్

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 04, 2018, 05:29 PM

రజనీకాంత్ .. అక్షయ్ కుమార్ .. ఎమీ జాక్సన్ ప్రధాన పాత్రధారులుగా శంకర్ తెరకెక్కించిన '2.ఓ' .. నవంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, 4 రోజుల్లో 400 కోట్లను రాబట్టింది. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా, వసూళ్లపరంగా ఈ మూడు భాషల్లోను దూసుకుపోతోంది. ముఖ్యంగా హిందీ వెర్షన్ మరింత వేగంగా వసూళ్లను సాధిస్తోంది. బాలీవుడ్లో ఈ సినిమా నిన్న ఒక్క రోజునే 14 కోట్ల షేర్ ను సాధించడాన్ని విశేషంగా చెప్పుకుంటున్నారు. 5 రోజుల్లో హిందీ వెర్షన్ 100 కోట్ల షేర్ ను వసూలు చేసింది. తమిళ అనువాద చిత్రానికి బాలీవుడ్లో ఈ స్థాయి వసూళ్లు దక్కడం ఇదే మొదటిసారి. ఇలా బాలీవుడ్లో 5 రోజుల్లో ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన తొలి తమిళ అనువాద చిత్రంగా ఈ సినిమా కొత్త రికార్డును సృష్టించింది. ఇక చెన్నై నగరంలోనూ అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ సినిమా అదే జోరును కొనసాగిస్తోంది.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa