గోపీచంద్ మలినేని డైరెక్షన్లో నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూవీకి ఇంకా టైటిల్ ఖరారు చెయ్యలేదన్న విషయం తెలిసిందే కదా.
ఈ మూవీ షూటింగ్ అంతిమ దశకు చేరుకుంది... ప్లస్... దగ్గర్లోనే పెద్ద పండగ దసరా రాబోతుంది... సో, బాలయ్య నుండి అభిమానులకు దసరా కానుక వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదేనండి... ఎప్పటి నుండో ఫ్యాన్స్ ఈ మూవీ టైటిల్ కోసం వేకళ్ళతో ఎదురుచూస్తున్నారు కదా...!! దసరా రోజున ఈ మూవీ టైటిల్ ఎనౌన్స్మెంట్ జరగొచ్చని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకైతే మేకర్స్ నుండి ఎలాంటి అప్డేట్ లేదు... కానీ ఈ నాల్రోజుల్లో వస్తుందేమో చూడాలి.
పోతే, ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa