సంగీత దర్శకుడు RP పట్నాయక్ సినిమాకు సంబంధించి ఒక్క సంగీతంలోనే కాక, నటన, దర్శకత్వం, గానం, రచన విభాగాల్లోనూ మంచి నైపుణ్యం ఉంది.
సంగీత దర్శకుడిగా ఎన్నో సినిమాలకు సూపర్ హిట్ ఆల్బమ్స్ కంపోజ్ చేసిన పట్నాయక్ గారు కెరీర్ లో ఇప్పటివరకు ఏడు సినిమాలకు దర్శకత్వం చేసారు. లేటెస్ట్ గా ఆయన డైరెక్ట్ చేస్తున్న ఎనిమిదవ చిత్రం "కాఫీ విత్ ఏ కిల్లర్".
ది బెస్ట్ క్రియేషన్స్, సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ సంయుక్త బ్యానర్లపై సెవెన్ హిల్స్ సతీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ RP పట్నాయక్ కాగా ఆయన బ్రదర్ గౌతమ్ పట్నాయక్ క్రియేటివ్ హెడ్ గా పని చేస్తున్నారు. తిరుమల్ నాగ్ డైలాగ్ రైటర్ గా పని చేస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలయ్యాయి. వీటిలో లీడ్ హీరో ఫేస్ కనిపించట్లేదు కానీ, టైటిల్ కి తగ్గట్టే హీరో ఒక చేత్తో కాఫీ కప్, మరొక చేత్తో గన్ పట్టుకుని కనిపిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి, రవిబాబు, సత్యం రాజేష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa