ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ "అల వైకుంఠపురంలో". మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకుడు. 2020లో విడుదలైన ఈ మూవీ అల్లుఅర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడవ సినిమా.
గతంలో ఇదే కాంబోలో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టాయి. హ్యాట్రిక్ హిట్ కొట్టిన ఈ కాంబో మరోసారి తెరపైకి రాబోతుందని టాక్.
ప్రస్తుతం బన్నీ సుకుమార్ డైరెక్షన్లో పుష్ప 2 పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉండగా, త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో మంచి యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు. వీరిద్దరూ ఈ రెండు సినిమాలను ముగించుకుని మరోసారి చేతులు కలపబోతున్నారని టాక్. హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన ఈ కాంబోలో మరొక సినిమా అంటే, అంచనాలు ఆకాశాన్ని అంటడం ఖాయం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa