ట్రెండింగ్
Epaper    English    தமிழ்

9.6 IMDB రేటింగ్ తో అదరగొడుతున్న నాగశౌర్య "కృష్ణవ్రింద విహారి"

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 23, 2022, 06:31 PM

టాలీవుడ్ లవర్ బాయ్ నాగశౌర్య, కొత్తమ్మాయి షెర్లీ సెటియా జంటగా నటించిన "కృష్ణవ్రింద విహారి" ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. తొలి షో నుండి పాజిటివ్ టాక్ వస్తున్న ఈ సినిమాకు చూసిన ప్రతి ఒక్కరు పాజిటివ్ రివ్యూలను ఇస్తున్నారు. బుక్ మై షోలో 97%, IMDB రేటింగ్స్ లో 9. 6, గూగుల్ లో 94% ... ఇలా అద్దిరిపోయే రేటింగ్ లను ఈ సినిమా అందుకుంది. తొలిరోజున ఇంతటి గుడ్ రివ్యూలు అందుకున్న ఈ సినిమా వారాంతంలో ఎలాంటి భారీ కలెక్షన్లను కొల్లగొడుతుందో చూడాలి.
అనీష్ R కృష్ణ ఈ సినిమాకు డైరెక్టర్. బాలీవుడ్ హీరోయిన్ షెర్లీ సెటియా ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కానుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మూలుపురి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa