ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"విక్రమ్" థియేటర్ హంగామా ...బుల్లితెరపై లేదెందుకు..?

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 23, 2022, 06:13 PM

విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ "విక్రమ్". లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో హీరో సూర్య స్పెషల్ గెస్ట్ రోల్ చెయ్యగా, విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషించారు.
థియేటర్లలో వంద రోజులు సందడి చేసిన ఈ సినిమా ఓటిటిలో కూడా చాలా మంచి రికార్డులు సాధించింది. కానీ, వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ TRP రేట్లలో విక్రమ్ హడావిడి అంతగా లేదనే చెప్పాలి. స్టార్ మా ఛానెల్ లో తెలుగులో ఇటీవలే ప్రసారమైన ఈ సినిమాకు కేవలం 5. 12 TRP మాత్రమే వచ్చింది. థియేటర్లలో, ఓటిటిలో ఇంకా ఈ సినిమా లభ్యం కావడమే ఇందుకు కారణమై ఉండొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa