మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో నటిస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పెషల్ క్యామియో రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. సల్మాన్ ప్రెజెన్స్ హిందీలో ఈ సినిమా పట్ల ప్రత్యేక అంచనాలను ఏర్పరిచింది.
లేటెస్ట్ గా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ఏ సెర్టిఫికెట్ ఇచ్చింది.
ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, బిజూ మీనన్, పూరి జగన్నాధ్, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన ఈ మూవీ హిందీ, తెలుగు భాషలలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa