ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటిటిలో సందడి చెయ్యనున్న చిన్న సినిమాలివే

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 11:12 PM

కళాపురం, ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలు  రేపటి నుండి డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాయి. కళాపురం సినిమా జీ 5 ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుండగా,
ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది.
కమెడియన్ సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో  డైరెక్టర్ కరుణ కుమార్ తెరకెక్కించిన చిత్రమే కళాపురం. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, R 4 ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
జాతిరత్నాలు ఫేమ్ కేవీ అనుదీప్ కధ అందించిన చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంచెట్టి డైరెక్టర్లుగా వ్యవహరించిన ఈ సినిమాలో శ్రీకాంత్ రెడ్డి, సంచితా బసు హీరోహీరోయిన్లుగా నటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa