సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో SSMB 28 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఇటీవలే షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ మూవీ భారీ యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది.
ప్రస్తుతానికి ఆ షెడ్యూల్ ముగియడంతో సూపర్ స్టార్ మహేష్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్ తో తీసుకున్న ఒక కూల్ సెల్ఫీని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. ఇందులో మహేష్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa