సెప్టెంబర్ 30న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న పొన్నియిన్ సెల్వన్ నుండి వరసగా లిరికల్ సాంగ్స్ రిలీజ్ అవుతూ వస్తున్నాయి.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి అలనై నీకై అనే రొమాంటిక్ మెలోడీ విడుదలైంది. ఈ పాట హీరో కార్తీ, ఐశ్వర్య లక్ష్మి ల మధ్య డ్యూయెట్ సాంగ్ లా ఉంది. AR రెహ్మాన్ మార్క్ మెలోడీ ఈ పాటలో క్లియర్ గా కనిపిస్తుంది. ఈ పాటను అంతర నంది ఆలపించగా, అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు.
మణిరత్నం డైరెక్షన్లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో చియాన్ విక్రమ్, కార్తీ, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, జయం రవి, శోభితా ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa