కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అప్ కమింగ్ మూవీ 'కెప్టెన్ మిల్లర్'. అరుణ్ మాతేశ్వరన్ ఈ సినిమాకు దర్శకుడు కాగా టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీ రోల్ లో నటిస్తున్నారు.
లేటెస్ట్ గా మేకర్స్ ఈ మూవీ హీరోయిన్ ఎవరన్నది సస్పెన్స్ రివీల్ చేసారు. మోస్ట్ హ్యాప్పెనింగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ ధనుష్ కు జోడిగా నటించబోతుందంటూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసి, వస్తున్న పుకార్లు నిజమేనని ధృవీకరించారు. కొన్నాళ్లుగా ఈ మూవీ హీరోయిన్ ప్రియాంకేనని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తుంది. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa