యంగ్ హీరో సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం 'లైక్ షేర్ సబ్స్క్రైబ్'. కొంచెంసేపటి క్రితమే ఈ మూవీ టీజర్ ను హీరో నితిన్ విడుదల చేసి, మూవీటీం కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
టీజర్ లో సినిమా నేపధ్యం గురించి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. హీరోకు అందమైన ప్రదేశాలకెళ్లి ట్రావెల్ వ్లాగ్స్ చెయ్యాలని ఉండడం, ఈ క్రమంలో వింత మనుషులను, వింత అనుభవాలను ఫేస్ చెయ్యడమే సినిమా అని తెలుస్తుంది. టీజర్ సినిమా కామెడీ గా ఉంటూనే, థ్రిల్ చేస్తుందని హింట్ ఇస్తుంది.
ఈ మూవీకి మేర్లపాక గాంధీ దర్శకుడు కాగా, నెల్లూరు సుదర్శన్ కీరోల్ లో నటిస్తున్నారు. పోతే, ఈ మూవీ నవంబర్ లో విడుదల కాబోతుందని మేకర్స్ టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa