బాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'బ్రహ్మాస్త్ర' ఇటీవలే విడుదలై మిక్స్డ్ టు పాజిటివ్ టాక్ తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను నమోదు చేస్తున్న విషయం తెలిసిందే.
ఐతే, ఈ మూవీ బడ్జెట్ పై మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కొంతమందేమో ఈ సినిమా బడ్జెట్ 650 కోట్లను, మరికొంతమందేమో 410 కోట్లని, కానీ కలెక్ట్ చేసిందేమో చాలా తక్కువ పెర్సెంటేజ్ అని .. రకరకాల పుకార్లు ప్రచారంలో ఉన్నాయి.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా ఈ సినిమాను 600 కోట్లు పెట్టి నిర్మించారని పేర్కొన్నారు.
లేటెస్ట్ గా ఈ పుకార్లన్నిటికి హీరో రణ్ బీర్ ఫుల్ స్టాప్ పెట్టేసారు. బ్రహ్మాస్త్ర మూవీ చాలా యూనిక్ గా తెరకెక్కిందని, ఒక సినిమా కోసం కాదు ఒకేసారి ఈ సిరీస్ లో రాబోతున్న మూడు సినిమాలకు అని, ఆ సినిమాలో క్రియేట్ చేసిన సూపర్ పవర్స్ VFX ఇంకా తదితర సాంకేతిక నైపుణ్యతను మిగిలిన రెండు భాగాలలో చాలా ఈజీగా ఉపయోగించుకోవచ్చని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa