బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ "విక్రమ్ వేద". కోలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ 'విక్రమ్ వేద' కు అఫీషియల్ హిందీ రీమేక్ ఈ సినిమా.
తమిళ విక్రమ్ వేదాను డైరెక్ట్ చేసిన పుష్కర్ - గాయత్రి ఈ సినిమాకు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ఆల్కహోలియా అనే ఫాస్ట్ బీట్ సాంగ్ విడుదలైంది. ఈ పాటలో హృతిక్ వేసే స్టెప్స్ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. విశాల్ - శేఖర్ అందించిన పెప్పి మ్యూజిక్ కు హృతిక్ క్రేజీ స్టెప్స్ కలవడంతో ఈ పాట ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది.
రాధికా ఆప్టే, రోహిత్ సరఫ్, షరీబ్ హష్మీ మరియు యోగితా బిహాని ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 30, 2022 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa