శరత్ మండవ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించిన "రామారావు ఆన్ డ్యూటీ" సినిమా గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ చిత్రంలో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనుండగా, దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించారు. తాజా అప్డేట్ ప్రకారం, ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఈరోజు నుంచి సోనీLIV ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియర్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రసారానికి అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో వేణు తొట్టెంపూడి, నాజర్, నరేష్, పవిత్ర లోకేష్ మరియు జాన్ విజయ్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ మరియు RT టీమ్ వర్క్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa