నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి". 'అష్టాచెమ్మా' ఫేమ్ ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.
సెప్టెంబర్ 16వ తేదీన అంటే రేపే ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. టీజర్, సాంగ్స్, ట్రైలర్ ...ఇలా ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా, రేపు విడుదల కాబోతున్న ఈ మూవీ ఆ అంచనాలను ఏమేరకు అందుకుని సుధీర్ బాబు, కృతిశెట్టిలకు విజయం అందిస్తుందో చూడాలి.
మైత్రి మూవీ మేకర్స్, బెంచ్ మార్క్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేంద్ర బాబు, కిరణ్ బళ్ళపల్లి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa