మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నైట్రో స్టార్ సుధీర్ బాబు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 16, 2022న థియేటర్లలో విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని U/A సర్టిఫికేట్ పొందినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా మొత్తం 144 నిమిషాల రన్ టైమ్ ని కలిగి ఉంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు.
ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన బబ్లీ బ్యూటీ కృతి శెట్టి జోడీగా నటిస్తుంది. శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి బెంచ్‌మార్క్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa